Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు రాక
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు. ఆయన కుటుంబ సమేతంగా తిరుమల వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకోనున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తొలి సారి ఆయన తిరుమలకు రానున్నారు. ఈరోజు రాత్రికి రచన అతిథి గృహంలో బస చేయనున్నారు.
విజయవాడ వస్తుండటంతో...
రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. దాదాపు రెండున్నర నెలల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న చంద్రబాబు నేడు విజయవాడ రానుండటంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనను కలిసేందుకు పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముంది. ఆయన ఆరోగ్యం బాగాలేక ఇప్పటి వరకూ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి కరకట్ట ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.