Chandrababu : నేడు బెయిల్ పై విచారణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2023-11-15 02:56 GMT
chandrababu, tdp, cyclone, party leaders,  stand by the victims
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఇప్పటికే యాభై రెండు రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

మధ్యంతర బెయిల్ పై...
అయితే కంటి ఆపరేషన్ చేయించుకోవాలని, శరీరంపై దుద్దుర్లు వస్తుండటంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనకు ఈ నెల 28వ తేదీ వరకూ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ రోజు రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది. ఈ విచారణలో ఆయనకు బెయిల్ లభిస్తే ఇక ఆయన రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 28వ తేదీతో మధ్యంతర బెయిల్ గడువు ముగియనుండటంతో టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.


Tags:    

Similar News