Chandrababu : నేడు మద్యం కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2023-11-22 04:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మద్యం కేసులో ఈ విచారణ జరగనుంది. మద్యం విషయంలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, భారీగా ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

సీఐడీ వాదనలు....
ఇప్పటికే ఈ కేసులో తమ వాదనలను చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లురవీంద్ర తరుపున న్యాయవాదులు వినిపించారు. శాసనసభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును తొలగించారని బాబు తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. సీఐడీ వాదనలను నేడు కోర్టు విననుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో దీనిపై విచారణ ప్రారంభం కానుంది.


Tags:    

Similar News