ఉత్తరాంధ్రకు మరోసారి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వరసగా జిల్లాల పర్యటన చేపడుతున్నారు;

Update: 2023-04-30 04:09 GMT
ఉత్తరాంధ్రకు మరోసారి చంద్రబాబు
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వరసగా జిల్లాల పర్యటన చేపడుతున్నారు. మే మొదటివారంలో ఆయన తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రగిరి నియోజకవర్గంలోనూ చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మే రెండో వారంలో...
అలాగే మే 18, 19 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు. ఎస్‌.కోట నియోజకవర్గంలో మే 17న చంద్రబాబునాయుడు పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.


Tags:    

Similar News