టీడీపీ పోరాటం.. దశల వారీగా...?
విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది;
విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దశల వారీగా పోరాటం చేయాలన్న నిర్ణయంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవుతుందని, ప్రజల పక్షాన నిలబడేందుకు టీడీపీ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏడుసార్లు పెంచి...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలను పెంచారని చంద్రబాబు ఆరోపించారు. ఏడు సార్లు ప్రజలపై పన్నెండు వేల కోట్ల రూపాయలు భారాన్ని మోపారని, మరోసారి ప్రజల నడ్డివిరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీనిని వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఆందోళన చేయాలని చంద్రబాబు కోరారు. పోరాటం క్యాలెండర్ ను త్వరలోనే విడుదల చేస్తానని చంద్రబాబు చెప్పారు.