కుప్పం ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ

కుప్పం ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.;

Update: 2021-11-16 07:31 GMT

కుప్పం ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. కుప్పం ఎన్నికల కౌంటింగ్ కు ప్రత్యేక అధికారిని నియమించాలని పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కుప్పం ఎన్నికల కౌంటింగ్ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.

వీడియో ద్వారా...
కుప్పంలో ఇప్పటికే దొంగ ఓట్లు పెద్దయెత్తున అధికార పార్టీ పోల్ చేసిందని టీడీపీ ఆరోపించింది. కౌంటింగ్ లోనూ అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడే అవకాశాలున్నాయని టీడీపీ భావిస్తుంది. అందుకే కుప్పం ఎన్నికల కౌంటింగ్ కు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని హైకోర్టును ఆశ్రయించింది. కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలని కోరింది.


Tags:    

Similar News