నేడు కడపకు చంద్రబాబు.. అలర్ట్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2023-04-18 02:50 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడపలో జరిగే పార్టీ జోనల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కడప జిల్లాకు చంద్రబాబు వస్తుండటంతో భారీ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు. కడప జోనల్ మీటింగ్ లో పాల్గొని చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఉద్రిక్తత నేపథ్యంలో...
వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈరోజు విచారణకు పిలవడంతో కడపలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ముందుగానే డీజీపీకి తమ నేతకు సరైన భద్రత కల్పించాలని కోరారు. దీంతో కడపలో కొంత ఉద్రిక్తత నెలకొంది.


Tags:    

Similar News