చంద్రబాబు ఫోన్... ఆరోగ్య పరిస్థితిపై ఆరా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నరసరావుపేట ఇన్ చార్జి చదలవాడ అరవింద్ బాబు కు ఫోన్ చేశారు.;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నరసరావుపేట ఇన్ చార్జి చదలవాడ అరవింద్ బాబు కు ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేయడంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడంతో ఆయనను నరసరావుపేటలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్వాస తీసుకోవడం....
అయితే చంద్రబాబు ఫోన్ చేసినా అరవింద్ బాబు మాట్లాడలేకపోవడంతో డాక్టర్లను సంప్రదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు లో బీపీ ఉండటంతో స్పృహతప్పి పడిపోయారని వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి అరవింద్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రి వద్దకు పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కాని, గుంటూరు కాని తరలించాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.