చలి పులితో వణుకుతున్న ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ఆ ప్రాంతంలో జనం వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకుని తమను తాము కాపాడుకుంటున్నారు. పాడేరులోనూ 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు....
ఉదయం పది గంటలు దాటినా సూర్యడు కనపించడం లేదు. ఎండ కోసం జనం పరితపించి పోతున్నారు. పది గంటల వరకూ పొగమంచు కప్పేసుకుంటుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బయటకు రావడానికి కూడా భయపడి పోతున్నారు. వాహనాల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దుప్పట్లు కప్పుకుని మరీ రోడ్లమీదకు రావడం కన్పిస్తుంది.