సముద్రంలోనే ఫైట్... విశాఖలో ఉద్రిక్తత

రింగ్ వలలు, సంప్రదాయ మత్స్యాకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. సముద్రంలోనే రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.;

Update: 2022-01-04 06:53 GMT
fishermen, visakhapatnam, jalaripet, gangammatalli gudi, sea
  • whatsapp icon

రింగ్ వలలు, సంప్రదాయ మత్స్యాకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. సముద్రంలోనే రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పెదజాలరిపేట, గంగమ్మతల్లి గుడి మత్స్యాకారుల మధ్య ఈ ఘర్షణ తలెత్తింది. సముద్రంలోనే బోటును తగులపెట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విశాఖ ప్రాంతంలో పెదజాలరిపేట, గంగమ్మ తల్లి గుడి మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు.

రింగ్ వలలు....
అయితే రింగ్ వలలు ఉపయోగిస్తుండటంతో తమకు చేపలు దొరకడం లేదని, చిన్న చేపలు అంతరించిపోతున్నాయని సంప్రదాయ మత్స్యాకారులు చెబుతున్నారు. పెదజాలరిపేట, గంగమ్మ తల్లి గుడి గ్రామస్థులు తీరప్రాంతానికి చేరి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్దయెత్తున మొహరించారు.


Tags:    

Similar News