పులుల పోరాటం చూశారా..?
పులులు నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి;

పులులు నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పులులు తిరుగాడుతుండటంతో ప్రజలు కూడా భాందోళనలు చెందుతున్నారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులుల కదలికలను పసిగట్టేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ట్రాప్ కెమెరాలో...
అయితే ట్రాప్ కెమెరాలో పులులు పోరాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరగడంతో కెమెరాలతో వాటిని గమనిస్తూ నిఘాను అటవీ శాఖ అధికారులు పెట్టారు. అయితే తాగేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో నీటికుంట వద్దకు వచ్చిన రెండు పులులు ఘర్షణపడటం ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ పులుల వయసు ఏడాదిన్నర వయసు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.