ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.;
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం లో ఒకటి, అనంతపురం లో ఒకటి ఒమిక్రాన్ కేసు నమోదయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్నట్లయింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. టెస్ట్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
పెరుగుతున్న కేసులు....
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి ఒంగోలు నుంచి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి, యూకే నుంచి అనంతపురం నుంచి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు చెప్పారు. వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఎటువంటి లక్షణాలు లేవని వైద్యులు చెబుతున్నారు. వారిద్దరి కాంటాక్ట్స్ ను కూడా గుర్తించి ఐసొలేషన్ కు తరలిస్తున్నారు. వీరిలో కొందిరికి నెగిటివ్ గా నిర్ధారణ అయింది.