Chandrababu : చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుడగా గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుడగా గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. గాజువాకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో రాయి ఒకటి వచ్చింది. అయితే ఆయనకు తగలలేదు. దీంతో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. దీంతో రాయివిసిరిన వ్యక్తి కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఎవరు విసిరారన్నది మాత్రం తెలియరాలేదు. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి జగన్ పై ఎవరో గులకరాయి విసిరారని, ఇప్పుడు విద్యుత్తు ఉన్నప్పుడే తనపై రాయి విసిరారని చంద్రబాబు అన్నారు.
బ్లేడ్ బ్యాచ్ పనే...
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లపనే ఇది అని అన్నారు. తెనాలిలోనూ పవన్ కల్యాణ్ పై రాయి వేశారన్నారు. తాను క్లేమోర్ మైన్స్ కే భయపడలేదని, చిన్నరాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పై రాయి విసిరిన వారు ఎవరో గుర్తించాలని, కోడికత్తి డ్రామాలాగా రక్తి కట్టించాలని చూశారంటూ ఎద్దేవా చేశారు. పేటీఎం బ్యాచ్ తానేదో రాళ్లు వేయించినట్లు మొరిగాయన్నారు. ఈ రాళ్లకు తాను భయపడే వాడిని కాదని చంద్రబాబు అననారు. నిత్యం తాను ప్రజల్లోనే ఉంటానని తెలిపారు.