Andhra Pradesh : కస్పూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.;

Update: 2025-03-21 07:27 GMT
admission, applications, kasturba gandhi balika vidyalayas
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దరఖాస్తులు చేసుకోవడానికి...
అనాథలు, బడి బయట పిల్లలు,బడి మానేసిన వారు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తులు https://apkgbv.apcfss.in ద్వారా పొందవచ్చని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. పూర్తి వివరాలు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని, సందేహాలకు 70751-59996, 70750-39990 నంబర్లకు సంప్రదించవచ్చు.


Tags:    

Similar News