నేటి నుంచి అమరావతిలో పనులు ప్రారంభం
రాజధాని అమరావతిలో నేటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి.
రాజధాని అమరావతిలో నేటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. శ్రావణమాసంలో మంచి ముహూర్తం ఉండటంతో ఈరోజు నుంచి పనులను ప్రారంభించనున్నారు. నేటి నుంచి అమరావతిలో ముళ్ల చెట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గత ఐదేళ్లుగా పెరిగిన చెట్లను నేటి నుంచి కొట్టి వేయనున్నారు. వాటిని తొలగించి చదును చేయనున్నారు.
36.50 కోట్ల రూపాయలతో...
ఈ మేరకు సీఆర్డీఏ పనులను ప్రారంభించనుంది. ఇందుకోసం 36.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు పిచ్చి చెట్లను తొలగించేందుకు టెండర్లను కూడా పిలిచారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ పనులను ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక వైపు ఉన్న ఎన్ 9 రోడ్డు నుంచి ఈ పనులు ప్రారంభం కానున్నాయి. జంగిల్ క్లియరెన్స్ ను చేపట్టిన తర్వాత భవనాల నిర్మాణల కోసం టెండర్లను పిలవనున్నారు.