Ys Vijayamma : ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ.. జగన్ వెంటేనా?
వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు;
వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్ వెంట జగన్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆయన 21 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఆయన ఈరోజు యాత్రకు బయలుదేరారు.
తమకే మద్దతని...
అయితే ఇడుపులపాయకు విజయమ్మ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటు వైసీపీ అధినేతగా కుమారుడు జగన్ ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటంతో వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపుతారన్న ఉత్కంఠ ఇటు పార్టీ నేతల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. అయితే ఈరోజు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ హాజరు కావడంతో ఆమె మద్దతు జగన్ కే ఉందని చెప్పినట్లయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.