రేపటి నుంచి పీపుల్స్ సర్వే : సజ్జల

రేపటి నుంచి మాసివ్ పీపుల్స్ సర్వే జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Update: 2023-04-06 12:48 GMT

రేపటి నుంచి మాసివ్ పీపుల్స్ సర్వే జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గృహసారధులు కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లి ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల తమ అభిప్రాయాన్ని తెలుసుకుంటారన్నారు. ప్రజల మనసులో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకుని, వారి మద్దతు కొరడమే ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం జరుగుతుందని సజ్జల తెలిపారు. జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

ఫీడ్ బ్యాక్...
ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఆడిగి గృహసారధులు అడిగి తెలుసుకుని పార్టీకి ఫీడ్ బ్యాక్ పంపుతారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఈకార్యక్రమం జరుగుతుందన్నారు. జగన్ నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఫీడ్ బ్యాక్ పార్టీకి అసవరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వమని ప్రజలను గృహసారధులు కోరతారని అన్నారు.


Tags:    

Similar News