కోటంరెడ్డిపై చర్యలు ఎందుకు?

కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు;

Update: 2023-02-01 08:01 GMT

కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించారు. ఆయనే తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంక చర్యలు ఏముంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు తప్పించి ఫోన్ ట్యాపింగ్ లను కాదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు...
ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమై పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, పదవి రాలేదని అసంతృప్తితోనే ఆయన బయటకు వెళుతున్నారని తాము భావిస్తున్నామని సజ్జల అన్నారు. కోటంరెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడినట్లు కూడా వార్తలు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


Tags:    

Similar News