డిసెంబరు 8న బెజవాడలో బీసీ ఆత్మీయ సభ

డిసెంబరు నెల 8వ తేదీన విజయవాడలో ఆత్మీయ సభను ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు;

Update: 2022-11-26 07:42 GMT

డిసెంబరు నెలలో విజయవాడలో ఆత్మీయ సభను ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రులు, నేతలు సమావేశమయ్యారు. బీసీలకు చెందిన ముఖ్యనేతలు పది వేల మంది ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించనున్నారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్లు ఛైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లు అంతా హాజరవుతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ సమావేశం అనంతరం తెలిపారు.

సీఎం జగన్ ను ఆహ్వానించి...
ముఖ్యమంత్రి జగన్ ను ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించామన్నారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం బీసీలకు చేసిన, అందిన అనేక ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు ఇప్పటి మాదిరిగా ప్రయోజనం చేకూరలేదన్న విషయాన్ని బీసీలు గుర్తించేలా ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News