Rythubharosa:డబ్బులు విడుదల చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా

Update: 2024-02-28 06:59 GMT

Rythubharosa:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని తెలిపారు. మొత్తం 53. 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని.. గత టీడీపీ ప్రభుత్వం ఎగొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం.. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామన్నారు. భారతదేశంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను జమ చేసింది. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్న­లతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వో­ఎఫ్‌ఆర్‌ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్‌ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ ఉంది ప్రభుత్వం.


Tags:    

Similar News