నేడు జగనన్న చేదోడు నిధుల విడుదల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు;

Update: 2023-01-30 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. దాదాపు 330.15 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3,30,145 మంది లబ్ది పొందనున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున నగదును జమ చేయనున్నారు.

వినుకొండలో జరిగే...
జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమమిది. దీంతో వినుకొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో జగన్ నిధులను విడుదల చేయనున్నారు. దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందచేస్తుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 927,39 కోట్ల రూపాయాలను విడుదల చేసింది. అర్హులైన అందరికీ ఈ సాయం అందనుంది.


Tags:    

Similar News