'టీడీపీని కబ్జా' అంటూ వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక పలువురు నాయకులు

Update: 2023-09-12 09:07 GMT

స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక పలువురు నాయకులు తమ తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ కబ్జా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని కబ్జా చేసేందుకే నందమూరి బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో పార్టీని గుంజుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో యనమల కూడా ఉన్నారని.. ఆనాడు స్పీకర్‌గా ఉన్న యనమల తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. లోకేశ్ వల్ల ఏమీ కాదని, అందుకే బాలకృష్ణ, యనమల పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు. పోలీసుల ఎదుటే నారా లోకేశ్ బూతులు మాట్లాడుతున్నారని, ఆయన అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం మాట్లాడతాడనేది అందరికీ తెలుసని అన్నారు. టీడీపీని కబ్జా చేసే పనిలో బాలకృష్ణ, యనమల ముందున్నారని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.

టీడీపీ నేతలు చేసిన బంద్ పైన కూడా నాగేశ్వర రావు స్పందించారు. బంద్‌ ప్రభావం రాష్టంలో ఎక్కడా కనిపించలేదని.. కనీసం, చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ బంద్‌ గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదని.. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారన్నారు. అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని నారా లోకేశ్‌ కూడా చెప్పలేడు. ఎన్టీఆర్‌ కుటుంబం కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎందుకు చెప్పలేరన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగిందని అన్నారు.


Tags:    

Similar News