ఆ కార్లు మరింత ప్రియం

డీజిల్ కార్ల ధరలుపెరిగే అవకాశాలున్నాయి. కాలుష్యం పెరుగుతుందని పదిశాతం పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

Update: 2023-09-12 08:13 GMT

డీజిల్ కార్ల ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. డీజిల్ కార్లతో కాలుష్యం పెరుగుతుందని భావించి పదిశాతం పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ ను డీజిల్ కార్ల పై కేంద్ర ప్రభుత్వం విధించనున్నట్లు తెలిసింది.

డీజిల్ వాహనాలపై...
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ ఇంకా డీజిల్ కార్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. పెట్రోలుతో పోలిస్తే డీజిల్ ధర కొంత తక్కువగా ఉండటం కూడా ఈ రకమైన వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే డీజిల్ వాహనాల కారణంగా ఎక్కువగా పొల్యూషన్ ఏర్పడుతుందని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
ధరలు పెరుగుతాయి...
ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే వివిధ రకాల ప్రయోజనాలను కల్పించిన ప్రభుత్వం క్రమంగా డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లింపులో కూడా మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం డీజిల్ విషయంలో మాత్రం ట్యాక్స్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో డీజిల్ కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి.


Tags:    

Similar News