ఇకపై పుట్టిన తేదీ రుజువు కోసం ఆధార్‌ చెల్లుబాటు కాదు: EPFO కీలక నిర్ణయం

ఆధార్ కార్డ్‌కి సంబంధించి EPFO ​​కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్‌ నంబర్‌ను తీసుకోబోమని..

Update: 2024-01-17 13:13 GMT

EPFO

ఆధార్ కార్డ్‌కి సంబంధించి EPFO ​​కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్‌ నంబర్‌ను తీసుకోబోమని స్పష్టం చేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి EPFO ​​దానిని మినహాయించింది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది.

ఈ నిర్ణయం తీసుకుంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే EPFO.. ఆధార్ ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని తెలిపింది. జనవరి 16న EPFO ​​ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం.. యూఐడీఏఐ నుంచి లేఖ కూడా అందింది. పుట్టిన తేదీని మార్చుకుంటే ఆధార్ కార్డు చెల్లుబాటు కాదన్నారు. ఇది చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి తీసివేస్తున్నట్లు తెలిపింది. అందుకే ఆధార్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

జనన ధృవీకరణ పత్రంతో సహా ఈ పత్రాలు అవసరం:

ఇక జనన ధృవీకరణ పత్రం సహాయంతో ఈ మార్పు చేయవచ్చు. ఇది కాకుండా, ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన మార్క్‌షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కూడా ఉపయోగించవచ్చు. అందులో పేరు, పుట్టిన తేదీని పేర్కొనాలి. ఇది కాకుండా సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.

గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రంగా ఆధార్‌:

ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూదని చెప్పింది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వంచే జారీ చేస్తుంది. ఇది మీ గుర్తింపు, శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే ఆధార్‌ను తయారు చేసే సమయంలో వారి వివిధ పత్రాల ప్రకారం పుట్టిన తేదీని నమోదు చేశారు. కాబట్టి ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని తెలిపింది.

కోర్టు నుంచి అదే ఆదేశాలు:

వివిధ న్యాయస్థానాలు ఆధార్ చట్టం 2016పై అనేకసార్లు వైఖరిని స్పష్టం చేశాయి. ఇటీవల బాంబే హైకోర్టు కూడా మహారాష్ట్ర vs యూఐడీఏఐ, ఇతర కేసులలో ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని చెప్పింది. దీని తరువాత యూఐడీఏఐ డిసెంబర్ 22, 2023 న ఒక సర్క్యులర్ జారీ చేసింది.

Tags:    

Similar News