మీ డబ్బు పోగొట్టుకోకుండా ఆధార్‌లో ఈ సెట్టింగ్స్‌ను మార్చండి

ఈ రోజుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ..

Update: 2023-10-19 11:57 GMT

ఈ రోజుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలు, పాన్‌ కార్డు వివరాలు ఇలా ఒక్కటేమిటి అన్ని వివరాలు సులభంగా తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ పోలీసులు సూచిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ ఆధార్‌ కార్డును సృష్టించి కూడా మోసాలకు పాల్పడేవారు పెరిగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో ఆధార్‌ కార్డును పోగొట్టుకుంటాము. అలాంటి సమయంలో వేరేవాళ్లు కూడా దానిని ఉపయోగించుకుని వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంతో పాటు బ్యాంకులో ఉన్న డబ్బును కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఆధార్ కార్డ్ వినియోగదారులు డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు ఇప్పుడే ఈ సెట్టింగ్‌ని అప్‌డేట్ చేసుకోండి.

➦ ముందుగా Google Play Store నుంచి mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

➦ యాప్ ఎగువన ఉన్న "రిజిస్టర్ మై ఆధార్" కార్డ్ బటన్‌పై నొక్కండి.

➦ తర్వాత యాప్ కోసం 4-అంకెల పాస్‌వర్డ్‌ను సృష్టించండి.

➦ మీరు ఇప్పుడు ఆధార్ నంబర్, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ నమోదు చేయాలి.

➦ దీని తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

➦ మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఆధార్ ఖాతా ఓపెన్‌ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసి, "బయోమెట్రిక్స్ లాక్"పై నొక్కండి.

➦ తర్వాత లాక్ బయోమెట్రిక్‌పై క్లిక్‌ చేయండి.

 మీరు మళ్లీ సెక్యూరిటీ క్యాప్చాను నమోదు చేసి, ఆపై ఓటీపీని నమోదు చేయండి.

➦  మీరు ఓటీపీని ధృవీకరించిన తర్వాత, మీ బయోమెట్రిక్‌లు లాక్‌ అవుతాయి.


Tags:    

Similar News