రైలు ప్రయాణ ఛార్జీలతోనే విమానం టికెట్స్‌.. ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌

విమాన ప్రయాణం అంటే ధనికులకు మాత్రమే అనుకుంటాము. ఎందుకంటే ఛార్జీలు భారీగా ఉంటాయి. చాలా మందికి ఒక్కసారైనా విమానం ఎక్కాలన్నది..

Update: 2023-08-18 04:56 GMT

విమాన ప్రయాణం అంటే ధనికులకు మాత్రమే అనుకుంటాము. ఎందుకంటే ఛార్జీలు భారీగా ఉంటాయి. చాలా మందికి ఒక్కసారైనా విమానం ఎక్కాలన్నది ఒక కల. కానీ ఛార్జీలు ఎక్కువ ఉండటంపై ఆ కల చాలా మందిలో నెరవేరదు. ఇప్పుడు విమానం ఎక్కాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం వచ్చింది. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా బంపర్‌ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఆఫర్లలో భాగంగా రైలు ఛార్జీలతో విమానంలో ప్రయాణించవచ్చు. ఇందుకోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇది కొద్ది రోజులు మాత్రమే. ఆగస్ట్ 17న ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక సేల్‌లో దేశీయ రూట్లలో టిక్కెట్లు కేవలం రూ.1,470 నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపింది. సంస్థ ఈ సెల్‌లో దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ సేల్ 96 గంటలు మాత్రమే.

టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ ఈ ఆఫర్‌లో మీరు దేశీయ విమానాల కోసం 1,470 రూపాయలకు వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను కూడా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. అదే సమయంలో దేశీయ విమానాలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు రూ.10,130 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల కోసం కూడా కంపెనీ ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను అందించింది. మీరు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి కన్వీనియన్స్ రుసుము వసూలు చేయడం ఉండదు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయింగ్ రిటర్న్స్ సభ్యులు అన్ని టిక్కెట్లపై డబుల్ లాయల్టీ బోనస్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

మీరు అధీకృత ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే మీరు ఇప్పటికీ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. కానీ కన్వీనియన్స్ రుసుము చెల్లించాలి. ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రారంభించిన ఈ సేల్‌ టికెట్స్‌ ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఈ సెల్‌లో మీరు 1 సెప్టెంబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 మధ్య ప్రయాణానికి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. స్పైస్ జెట్ సేల్ కూడా ఆగస్ట్ 20తో ముగుస్తుంది. స్పైస్ జెట్ సేల్‌లో టిక్కెట్‌లను రూ. 1,515 ప్రారంభ ధరతో అందిస్తోంది. దీని కింద 15 ఆగస్టు 2023 నుంచి 30 మార్చి 2024 వరకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News