Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: ప్రతి రోజు చాలా మంది బ్యాంకు పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే ఇప్పుడు పండగ సీజన్‌ కాబట్టి బ్యాంకుల సెలవులు

Update: 2024-01-11 11:19 GMT

Bank Holidays: ప్రతి రోజు చాలా మంది బ్యాంకు పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే ఇప్పుడు పండగ సీజన్‌ కాబట్టి బ్యాంకుల సెలవులు ఉంటాయి. వాటిని ముందస్తుగా గమనించి బ్యాంకు పనుల కోసం ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం. అయితే ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయన్నది ముదస్తుగా నిర్ణయించి జాబితాను విడుదల చేస్తుంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండగ సందర్భంగా వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయో తెలుసుకుందాం. బ్యాంకుల్లో ఈ సెలవుదినాలు వివిధ రాష్ట్రాలు, ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించండి.

జనవరి 11న అగల్ సర్కిల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిజోరంలో ఈ రోజున మిషనరీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కోల్‌కతా సర్కిల్‌లోని బ్యాంకులు జనవరి 12న మూసి ఉంటాయి. స్వామి వివేకానంద జయంతిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజు జరుపుకుంటారు. అయితే దేశం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

జనవరి 13, 14 తేదీల్లో బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. జనవరి 13 నెలలో రెండవ శనివారం. దీని తర్వాత, నెలలో వచ్చే శనివారం సెలవు జనవరి 27న ఉంటుంది.

జనవరి 15న దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ముఖ్యంగా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, గౌహతి సర్కిళ్లలో జనవరి 15న బ్యాంకులు మూసివేస్తారు. ఈ ప్రదేశాలలో పొంగల్, మాగ్ బిహు పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

Tags:    

Similar News