ఖాతాదారులకు అలర్ట్‌.. అక్టోబర్ నెలలో సగం రోజులు బ్యాంక్ సెలవులు..

సెప్టెంబర్‌ నెల మూగియబోతోంది. అక్టోబర్‌ వస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు..

Update: 2023-09-27 08:00 GMT

సెప్టెంబర్‌ నెల మూగియబోతోంది. అక్టోబర్‌ వస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు సంబంధించిన హాలిడేస్‌ లిస్ట్‌ను విడుదల చేస్తుంటుంది. అలాగే వచ్చే నెల అంటే ఆక్టోబర్‌లో కూడా బ్యాంకులకు సెలవులు భారీగానే ఉండనున్నాయి. అయితే వినియోగదారులు ముందస్తుగా బ్యాంకుల సెలవులను గమనించి ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఏయే రోజు సెలవులు ఉంటుందనే విషయం తెలుసుకుంటే సమయం వృధా కాకుండా పని దినాల్లో బ్యాంకుల పనులు చేసుకోవచ్చు. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు మూత పడనున్నాయి. ఇందులో ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి ఉన్నాయి. అయితే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనిండి. రాబోయే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరి ఏయే రోజులలో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

☛ అక్టోబర్​ 2:- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి.

☛ అక్టోబర్​ 14:- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

☛ అక్టోబర్​ 15:- ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

☛ అక్టోబర్​ 18:- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్​లకు సెలవు.

☛ అక్టోబర్​ 19:- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు.

☛ అక్టోబర్​ 21:- శనివారం, దుర్గాపూజ.

☛ అక్టోబర్​ 22:- ఆదివారం.

☛ అక్టోబర్​ 23:- సోమవారం, మహా నవమి.

☛ అక్టోబర్​ 24:- మంగళవారం దసరా.

☛ అక్టోబర్​ 25:- దుర్గా పూజ

☛ అక్టోబర్​ 26:- యాక్సెషన్​ డే. జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

☛ అక్టోబర్​ 27:- దసై, దుర్గా పూజ.

☛ అక్టోబర్​ 28:- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.

☛ అక్టోబర్​ 29:- ఆదివారం.

☛ అక్టోబర్​ 31:- మంగళవారం, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి.



Tags:    

Similar News