Post Office 2023: ఈ ఏడాది పోస్టాఫీసు స్కీమ్‌లో వచ్చిన మార్పులు

Post Office 2023: కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసులు రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు ద్వారా మంచి ప్రయోజనం..

Update: 2023-12-30 11:15 GMT

Post Office 2023

Post Office 2023: కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసులు రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు ద్వారా మంచి ప్రయోజనం పొందే విధంగా రూపొందించింది. ఈ పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అమలవుతున్నాయి. ఈ పొదుపు పథకాల్లో ఈ సంవత్సరం కేంద్రం సర్కార్‌ కొన్ని మార్పులు చేసింది. కొన్ని పథకాలపై పెట్టుబడి పరిమితి పెంచడంతో పాటు కొత్తగా మరో స్కీమ్‌ను తీసుకొచ్చింది.

టైమ్‌ డిపాజిట్‌

పోస్టాఫీసు అందిస్తున్న మరో పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. దీనిలో ఈ ఏడాది కొన్ని మార్పులు చేశారు. అయిదేళ్ల కాలావ్యవధి డిపాజిట్‌ను.. ఖాతా తెరిచిన నాలుగేళ్ల తర్వాత మూసివేయాలనుకుంటే పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాకు వర్తించే వడ్డీ 4శాతం అందిస్తారు. ప్రస్తుతం అయిదేళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాను డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాత మూసివేస్తే.. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాకు వర్తించే వడ్డీని వర్తింపజేస్తూ వచ్చారు.

మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌

ఇక పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ లిమిట్‌ని పెంచింది. గతంలో పర్సనల్‌ అకౌంట్‌ లిమిట్‌ రూ.4 లక్షలుగా ఉండేది. ఈ ఏడాదిలో దాన్ని రూ.9 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అంతేకాదు జాయింట్‌ ఖాతాలకు రూ.9 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15 లక్షలకు చేర్చారు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో ఒక వ్యక్తి ఇప్పటి వరకు రూ.15 లక్షల వరకు గరిష్ఠ డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉండేది.ఈ పథకం గరిష్ఠ డిపాజిట్‌ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది కేంద్రం. ఈ స్కీమ్‌కు ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. అలాగే, ఈ పథకం కింద ఖాతా ప్రారంభ గడువును సైతం నెల నుంచి మూడు నెలలకు పెంచారు. గతంలో ఈ ఖాతాను ఒక సారి మాత్రమే పొడిగించడానికి వీలుండేది. ఇప్పుడు అనేక సార్లు ఖాతాను పొడిగించవచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌

ఈ పథకం మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ పేరుతో 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ఈ స్కీమ్‌కు 7.50 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్‌పై రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి నిర్ణయించింది.

పీపీఎఫ్‌ ముందస్తు క్లోజింగ్ రూల్స్‌

పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ నిబంధనలనూ తపాలా శాఖ సవరించింది కేంద్రం. గతంలో పీపీఎఫ్‌ ముందస్తు మూసివేతపై 1 శాతం వడ్డీ తక్కువగా చెల్లించేవారు. ఖాతా ప్రారంభం లేదా పొడిగింపు తేదీ (ఎక్స్‌టెన్షన్‌) నుంచి ఈ మినహాయింపు వర్తింపజేసేవారు. తాజాగా నిబంధనను ఐదేళ్ల బ్లాక్‌గా మార్చారు. అంటే ఖాతాను మూసివేసిన పక్షంలో ఐదేళ్ల బ్లాక్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ కాలానికి మాత్రమే 1 శాతం తక్కువ వడ్డీ చెల్లిస్తారు.


Tags:    

Similar News