LPG Gas Price: గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరో వారం రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరానికి ముందు గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పాయి ఆయిల్‌..

Update: 2023-12-22 12:25 GMT

LPG Gas

మరో వారం రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరానికి ముందు గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పాయి ఆయిల్‌ కంపెనీలు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరపై 39 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్‌పై ఉంది. ఇది సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను 39 రూపాయలకు తగ్గించిన తర్వాత వాణిజ్య సిలిండర్ ఢిల్లీలో రూ.1757.50, కోల్‌కతాలో రూ.1869, ముంబైలో రూ.1710, చెన్నైలో రూ.1929.50కి అందుబాటులో ఉంటుంది. క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.

డొమెస్టిక్ సిలిండర్ ధర మారిందా?

అయితే దేశీయ LPG సిలిండర్ గురించి మాట్లాడినట్లయితే దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు ఆగస్టు నుంచి స్థిరంగా ఉన్నాయి. దాని రేటులో ఎటువంటి మార్పు లేదు. చివరిసారిగా ఆగస్టు 30, 2023న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50.

Tags:    

Similar News