RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక సమాచారం..అదేంటో తెలుసా?
మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బ్యాంకుల్లో వార్షిక ఖాతాలకు సంబంధించిన పని కారణంగా రూ. 2000 బ్యాంకు నోట్ల ..
మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బ్యాంకుల్లో వార్షిక ఖాతాలకు సంబంధించిన పని కారణంగా రూ. 2000 బ్యాంకు నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం 1 ఏప్రిల్ 2024 నాడు అంటే సోమవారం నుండి అందుబాటులో ఉండదు. మరుసటి రోజు అంటే మంగళవారం సెంట్రల్ బ్యాంక్‌లోని 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సదుపాయాన్ని పునరుద్ధరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
వార్షిక ఖాతాలకు సంబంధించిన పని కారణంగా సోమవారం ఏప్రిల్ 1, 2024న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని 19 ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000 బ్యాంకు నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని RBI తెలిపింది. ఆర్బీఐ వివరాల ప్రకారం.. 97.62 శాతం నోట్లు రికవరీ అయ్యాయి. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19న 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 29న పని వేళలు ముగిసే సమయానికి రూ.2000 నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయనీ, ఇంకా రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని బ్యాంక్ తెలిపింది.
పరిశ్రమలకు బ్యాంకు రుణాలు ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 8.6 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, టెక్స్‌టైల్స్ వంటి రంగాల వారీగా రుణాలు తీసుకునే వేగం పెరగడమే దీనికి ప్రధాన కారణం.వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలలో రుణ వృద్ధి ఫిబ్రవరిలో 20.1 శాతంగా ఉంది. ఇది ఏడాది క్రితం ఇదే నెలలో 15 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ డేటా తెలిపింది. ఎంపిక చేసిన 41 వాణిజ్య బ్యాంకుల నుండి ఫిబ్రవరికి వివిధ రంగాలకు సంబంధించిన బ్యాంక్ క్రెడిట్‌పై డేటా సేకరించబడింది.