ఈరోజూ అంతే.. గోల్డ్ రేట్స్

ఈరోజు కూడా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది

Update: 2023-10-05 03:48 GMT

బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ తగ్గుతున్నాయి. పది రోజుల నుంచి పసిడి ధర తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కొనుగోళ్లు తగ్గుముఖం పడుతుండటంతో ధరలు దిగి వస్తున్నాయి. బంగారం ధరలు ఎప్పుడూ అంతే. వెండి ధరలు కూడా అంతే. పరుగులు తీస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. పండగలు, పబ్బాలకు మాత్రమే కాదు.. ప్రతి శుభకార్యానికి బంగారానికి, వెండిని ఉపయోగిస్తారు. అందుకే దక్షిణ భారతదేశంలో బంగారం, వెండి ధరలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా బంగారు ఆభరణాలనే కొనుగోలు చేస్తుండటం సంప్రదాయంగా వస్తుంది.

ఈరోజు ధరలు...
ఈరోజు కూడా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి మాత్రం కిలో పై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,590 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,370 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 73,100 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News