సెప్టెంబర్‌లో పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే..లేకుంటే నష్టమే
సెప్టెంబరు నెలలో చాలా పండుగలు ఉన్నాయి. ఇది జన్మాష్టమి నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబరు నెలలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో..
సెప్టెంబరు నెలలో చాలా పండుగలు ఉన్నాయి. ఇది జన్మాష్టమి నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబరు నెలలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో జి 20 సమావేశం కూడా జరగాల్సి ఉండగా, చాలా ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిన 5 ముఖ్యమైన పనులు ఉన్నాయి. చివరి అవకాశం వేచి ఉండాకుండా ముందస్తుగా చేసుకోవడం మంచిది.
పొదుపు, సబ్సిడీ, బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక నియమాలు అక్టోబర్ నుంచి పూర్తిగా మారుతాయి. అంటే, మీకు సెప్టెంబర్ 30 వరకు చివరి అవకాశం ఉంది అన్నట్లు. ఇందులో కూడా వివిధ సెలవుల కారణంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలైనవి మూసి ఉంటాయని గుర్తించుకోండి.
ఈ 5 పనులను తప్పకుండా పూర్తి చేయండి:
2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్‌లో కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే చివరి అవకాశం. పూర్తి జాబితాను తనిఖీ చేయండి
➦ ముందుగా మీ దగ్గర ఏదైనా 2000 రూపాయల నోటు మిగిలి ఉంటే వెంటనే మార్చుకోండి. సెప్టెంబర్ 30 దాని చివరి తేదీ. అలాగే ఆ తర్వాత ఈ నోట్లు నిరుపయోగంగా మారతాయి. ఆర్బీఐ ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో సెప్టెంబర్ నెలలో మొత్తం 30 రోజులలో 16 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. అటువంటి సమయంలో మీరు సమయానికి 2000 రూపాయల నోట్లను మార్చకపోతే మీరు సమస్యలను ఎదుర్కొవచ్చు.
➦ దీని తర్వాత మీరు ఈ నెలలోనే మీ ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసే పనిని పూర్తి చేయాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సెప్టెంబర్ 14 వరకు దీన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ తేదీ వరకు ఆధార్ ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏదైనా అప్‌డేట్ కోసం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు దీని చివరి తేదీ జూన్ 14 అయితే తరువాత దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.
➦ మీరు పోస్టాఫీసులో లేదా మరేదైనా చిన్న పొదుపులో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే అప్పుడు మీ పాన్, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి అయింది. కొత్త కస్టమర్‌లకు ఈ నియమం ఏప్రిల్ 1, 2023 నుంచి వర్తిస్తుంది. అయితే పాత కస్టమర్‌లకు సెప్టెంబర్ 30, 2023 వరకు సమయం ఉంది. ఈలోగా ఈ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం.
➦ మీరు 30 సెప్టెంబర్‌లోపు IDBI బ్యాంక్ 'అమృత్ మహోత్సవ్ FD' స్కీమ్‌ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక పొదుపు పథకం. ఇందులో బ్యాంక్ మీకు 7.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30.
➦ దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కూడా పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ ఎఫ్‌డీ స్కీమ్ పేరు 'Wecare FD' పథకం. ఇందులో 7.50 శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది బ్యాంకు.