గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం
బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం
బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్న క్రమంలో దేశీయంగానూ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2035 డాలర్ల పైన ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.47 డాలర్ల వద్ద ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ. 57,590 వద్దకు దిగివచ్చింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.10 మేర తగ్గి రూ. 62,830 వద్దకు చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 57,740 వద్ద ఉంది. 24 క్యారెట్ల 999 ప్యూరిటీ గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 10 మేర దిగివచ్చి రూ. 62,990 వద్ద ఉంది. కిలో వెండి రేటు నేడు రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ లో రూ. 75,400 వద్ద ట్రేడింగ్ అవుతోంది.