Gold Prices : ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ధరలు అందుబాటులో ఉంటాయా?
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ మాత్రమే తగ్గుతుంటాయి
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ మాత్రమే తగ్గుతుంటాయి. పెరిగినప్పుడు ఎక్కువగా తగ్గినప్పుడు స్వల్పంగా ధరలు తగ్గి కొనుగోలుదారులను నిరాశపరుస్తూనే ఉంటాయి. అందుకే బంగారం ధర చూస్తుండగానే అంత ధరకు ఎగబాకింది. సామాన్యులు కొనుగోలు చేయడానికి కూడా భారంగా మారింది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్...
పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం బంగారం తప్పకుండా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. అంటే బంగారం కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే జ్యుయలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. వీటిని ఆపడం ఎవరి తరమూ కాదు. అలా చూస్తూనే ఉండాల్సిందే.
ధరలు ఇవీ...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర పై 150 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,960 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 78,000 రూపాయలకు పెరిగింది.