పరుగుకు బ్రేక్
శంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది ఒకరకంగా కొనుగోలు చేసే వారికి కొంత ఊరట అన చెప్పాలి.
పసిడి అంటే ఎవరికి ఇష్టముండదు? బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు. కానీ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. బంగారం కొనుగోలు చేయాలంటే అంత సాధారణమైన విషయమేమీ కాదు. ఒకప్పుడు ఉన్న బంగారం ధరకు, ప్రస్తుత ధరకు తేడాను పరిశీలిస్తే నాలుగు రెట్లు ధరలు పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్ పెరిగడం, దిగుమతులు తగ్గడం వల్లనే బంగారం ధరలు నింగినంటుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
నేటి ధరలు...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది ఒకరకంగా కొనుగోలు చేసే వారికి కొంత ఊరట అన చెప్పాలి. బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతుండటంతో గత కొన్ని రోజులుగా పరుగులు తీసిన బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,950 రూపాయల వద్ద నిలకడగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 79,300 రూపాయలకు చేరుకుంది.