మీ బంగారం స్వచ్ఛమైనదేనా..? మీ మొబైల్‌లో తెలుసుకోండిలా!

పండగ సీజన్‌లో మహిళలతో బంగారం షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. అయితే మోసాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ఏదీ..

Update: 2023-10-25 01:44 GMT

పండగ సీజన్‌లో మహిళలతో బంగారం షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. అయితే మోసాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ఏదీ కొనాలన్నా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కొనుగోలు చేసే వస్తువు అది మంచిదా? నకిలీదా? అనేది గుర్తించడం చాలా ముఖ్యం. దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే అత్యంత ఇష్టమైనది. పండక్కి బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగానే సాగుతుంటాయి. అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం స్వచ్చమైనదా ? కదా అని గుర్తించాలి.

అయితే బంగారం స్వచ్ఛత విషయంలో మోసాలు జరుగుతున్నాయనే నేపథ్యంలో కేంద్ర సర్కార్‌ ఇటీవల కాలంలో హాల్‌ మార్క్‌ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం అందుబాటులోకి తీసుకురావడం వల్ల బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ''బీఐఎస్ కేర్‌'' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా బంగారం క్వాలిటీని సులభంగా తెలుసుకునే వీలుంటుంది.

ముందుగా ఈ హల్‌మార్క్‌ విధానం అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత అందులో కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల బంగారు ఆభరణాలపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్‌ను తప్పసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్క ఆభరణానికి ప్రత్యేక హెచ్‌యూఐడీ నెంబర్‌ కేటాయిస్తారు. ఈ కోడ్‌ ఆధారంగానే బంగారం స్వచ్ఛమైందా.? కాదా అనేది తెలుస్తుంది. అందుకే మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై హాల్‌ మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (Hallmark Unique Identification -HUID) ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ కోడ్‌ ఆధారంగానే గోల్డ్‌ క్వాలిటీని అనేది తెలుసుకోవచ్చు.

గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడం ఎలా?

ఇక గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్‌ కేర్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, ఓటీపీతో ముందు యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం యాప్‌ ఓపెన్ కాగానే ‘వెరిఫై హెచ్‌యూఐడీ’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత మీరు కొనుగోలు చేసే ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్‌ చేయించిన షాప్‌, హాల్‌ మార్క్‌ వేసిన కేంద్రం, బంగారం స్వచ్ఛత వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.


Full View


Tags:    

Similar News