UPI: ఓటీపీ లేని యూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. లిమిట్‌ లక్షకు పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుపిఐ ఇ-మాండేట్ పరిమితిని లక్ష రూపాయలకు పెంచింది. ఈ ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ మ్యూచువల్ ఫండ్;

Update: 2023-12-09 23:30 GMT
No OTP Authentication, UPI Autopay Limit Increased, UPI Services, RBI
  • whatsapp icon

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుపిఐ ఇ-మాండేట్ పరిమితిని లక్ష రూపాయలకు పెంచింది. ఈ ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ మ్యూచువల్ ఫండ్ SIP, బీమా ప్రీమియం చెల్లింపు మొదలైన వాటికి ఉపయోగించవచ్చు. ఈ ఆటో డెబిట్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం కూడా ఉపయోగించవచ్చు.

గతంలో ఆటో డెబిట్ పరిమితి ఒక్కో లావాదేవీకి రూ.15,000గా ఉండేది. అంటే ఒకేసారి రూ.15,000 వరకు మాత్రమే ఆటోమేటిక్ డిడక్షన్‌కు పరిమితి ఉండేది. దాని కంటే ఎక్కువ మొత్తం ఆటో డెబిట్ చేసేందుకు వీలుండేది కాదు. అలాంటప్పుడు ఆటో డెబిట్ OTP ద్వారా నిర్ధారించాల్సి ఉండేది. ఇప్పుడు ఆటో డెబిట్ పరిమితిని రూ.15,000 నుంచి రూ.లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.

మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ బిల్లు మొదలైన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో రూ. 15,000 కంటే ఎక్కువ లావాదేవీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున వినియోగదారులను సులభతరం చేయడానికి RBI ఈ పరిమితిని పెంచింది.

UPI ఆటో డెబిట్ అంటే ఏమిటి?

ఇది UPI ఆటోపేగా ప్రసిద్ధి చెందింది. మీ మొబైల్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు మొదలైనవి Paytm, Phone Pay, Google Pay మొదలైన ప్లాట్‌ఫారమ్‌లలో స్వయంచాలకంగా చెల్లించబడతాయి. మొబైల్ బిల్లు రాగానే ఆ మొత్తం ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్‌ అవుతాయి. భారతదేశంలో, ఈ విధంగా ఆటో డెబిట్ కోసం నమోదైన సేవల సంఖ్య 8.5 కోట్లు. వీటి ద్వారా నెలకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

Tags:    

Similar News