PAN-Aadhaar: పాన్-ఆధార్‌ను ఆలస్యంగా లింక్ చేసిన వారి నుంచి రూ. 2,125 కోట్లు వసూలు

30 జూన్ 2023లోపు ఇచ్చిన చివరి తేదీ తర్వాత కూడా పాన్-ఆధార్‌ను లింక్ చేయడంలో జాప్యం చేసిన వ్యక్తుల నుండి కేంద్ర

Update: 2023-12-23 01:00 GMT

PAN-Aadhaar

30 జూన్ 2023లోపు ఇచ్చిన చివరి తేదీ తర్వాత కూడా పాన్-ఆధార్‌ను లింక్ చేయడంలో జాప్యం చేసిన వ్యక్తుల నుండి కేంద్ర ప్రభుత్వం రూ. 2,125 కోట్ల పెనాల్టీని వసూలు చేసింది. వీటిలో, ప్రభుత్వం ప్రతి పాన్ కార్డ్ హోల్డర్ నుండి రూ. 1,000 జరిమానా వసూలు చేసిన తర్వాత మాత్రమే పాన్-ఆధార్ లింక్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2.125 కోట్ల మంది పాన్-ఆధార్‌ను లింక్ చేసారు. అలాగే వారి నుండి ప్రభుత్వం రూ. 2,125 కోట్లను రికవరీ చేసింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో, రాజ్యసభ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆర్థిక మంత్రిని పాన్-ఆధార్‌ను లింక్ చేసే వారి సంఖ్య, డియాక్టివేట్ చేయబడిన పాన్ కార్డ్‌ల సంఖ్య గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ జూన్ 30 వరకు 54,67,74,649 పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానించబడి ఉన్నాయని, ఏ పాన్ కార్డును డీయాక్టివేట్ చేయలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

ప్రభుత్వం బదులిచ్చింది

1,000 రూపాయల పెనాల్టీ చెల్లించి ఎంత మంది పాన్-ఆధార్‌ను లింక్ చేశారని, వారి నుంచి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని వసూలు చేసిందని ఫూలో దేవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి స్పందిస్తూ.. 2023 జూలై 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు 2.125 కోట్ల మంది రూ.1000 పెనాల్టీ చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేశారని, దీని ద్వారా ప్రభుత్వం రూ.2125 కోట్లు రికవరీ చేసిందని చెప్పారు.

పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోవడం వల్ల పన్ను వాపసు ఇవ్వడం లేదా దానికి వడ్డీ చెల్లించడం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల బకాయిల్లో ఏదైనా పన్ను ఉంటే, అప్పుడు ఎక్కువ రేటుతో పన్ను వసూలు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో సుమారు 70 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. వీరిలో 60 కోట్ల మంది పాన్-ఆధార్‌ను లింక్ చేశారు. అందులో 2.125 కోట్ల మంది పెనాల్టీ చెల్లించి లింక్ చేశారు.

Tags:    

Similar News