Gold Price Today : మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఇంత భారీగా పెరిగితే ఎలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది

Update: 2024-12-04 03:43 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు ఊహించినట్లే జరుగుతుంది. నిన్న మొన్నటి వరకూ స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ధరలు ఎగబాకడం బంగారం విషయంలో సహజమే అయినప్పటికీ భారీ స్థాయిలో ధరలు పెరిగితే ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో దీపావళి సీజన్ లోనూ, థన్ తెరాస్ కు కూడా అమ్మకాలు పెద్దగా లేవని, గత ఏడాదితో పోలిస్తే ఇరవై శాతం వ్యాపార లావాదేవీలు పడిపోయాయని చెబుతున్నారు. అందుకే బంగారం ధరలు పెరిగినప్పుడల్లా వ్యాపారులు కూడా ఒకింత ఆందోళనకు గురవుతారని చెప్పక తప్పదు.

ధరలు పెరగడంతో...
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. యువత నుంచి వృద్ధుల వరకూ ప్రధానంగా మహిళల్లో బంగారం అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. బంగారం ఉంటే తమకు సమాజంలో తగిన గౌరవం లభిస్తుందని భావనతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తుంటారు. బంగారం, వెండి వస్తువులను తమ సెంటిమెంట్ గా భావిస్తారు. తమ ఇళ్లలో ఈ రెండు వస్తువులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదన్న నమ్మకం బాగా పెరిగిపోవడంతో కొన్నేళ్ల నుంచి బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. అయితే ధరలు తమ చేయి దాటి పోవడంతో బంగారం కొనుగోలుపై ఆసక్తి కూడా అదే స్థాయిలో తగ్గింది. బంగారం తమకు దక్కదని భావించి కొందరు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు.
తగ్గిన వెండి ధరలు...
బంగారం, వెండి వస్తువులను స్టేటస్ సింబల్ గా భావిస్తారు. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించే వారు ఎక్కువ మంది ఇటీవల కాలంలో కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్నారు. సులువుగా తీసుకెళ్లేందుకు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునేందుకు బంగారం ఉపయోగపడుతుందని భావించి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,790 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News