మీ ఒరిజినల్ ఆధార్ పోయిందా? కొత్త పీవీసీ కార్డు పొందండిలా!

మనదేశంలో అత్యంత ప్రధానమైన గుర్తింపు పత్రం ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా

Update: 2023-11-03 03:26 GMT

మనదేశంలో అత్యంత ప్రధానమైన గుర్తింపు పత్రం ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా, తదితరాలకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న కార్డును పోగొట్టుకుంటే ఎలా? డూప్లికేట్ ఉన్నప్పటికీ, ఒరిజినల్ ఒరిజినలే కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? తిరిగి మీరు పీవీసీ కార్డును తీసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త పీవీసీ ఆధార్ కార్డును పొందే వెసులుబాటు ఉంది. ఆధార్ కార్డు రీ ప్రింట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

మీరు పొగొట్టుకున్న ఒరిజినల్ ఆధార్ కార్డులను తిరిగి పొందేందుకు ఆధార్ కార్డులను ఇష్యూ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇటీవల ప్రత్యేకమైన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే స్వరీస్ ద్వారా కొత్త పీవీసీ కార్డును మీరు తీసుకోవచ్చు. అది కూడా కేవలం రూ. 50 ఛార్జ్ తోనే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేయకపోయినా మీరు ఈ సర్వీస్ ను వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే విధానం గురించి తెలుసుకుందాం.

➦ ముందుగా యూఐడీఏఐ అధికారికి వెబ్ సైట్‌లోకి వెళ్లి మైఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దానిలో జెనెరిక్ పీవీసీ ఆప్షన్‌ను ఎంచుకోండి.

➦ తర్వాత మీ 12 అంకెలతో కూడిన ఆధార్ నంబర్(యూఐడీ)ని ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ కూడా నమోదు చేయాలి.

➦ ఆ తర్వాత మీరు ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉంటే వెంటనే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి.

➦ ఒకవేళ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే మై మొబైల్‌ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అనే దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి.

➦ మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి,టెర్మ్స్ అండ్ కండీషన్స్ కు సంబంధించిన చెక్ బాక్స్ లో క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి.

➦ మీ ఆధార్ కార్డు వివరాలతో కూడిన ప్రీవ్యూ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది.

➦ ఆ వివరాలు సరిచూసుకొని రీ ప్రింట్ కి ఆర్డర్ ఇవ్వాలి.

➦ ఆ తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మరో కొత్త పేజీ మీకు ఓపెన్ అవుతుంది.

➦ పేమెంట్ గేట్ వేలో పలు రకాల పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి.

➦ క్రెడిట్/డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంపకి చేసుకొని పేమెంట్ పూర్తి చేయాలి.

➦ ఆ వెంటనే మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకొని పీడీఎఫ్ లో సేవ్ చేసుకోవాలి.

➦. మీ ఇచ్చిన ఫోన్ నంబర్ కి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. దాని ద్వారా మీరు కార్డును బదిలీని ట్రాక్ చేయవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్లో చెక్ ఆధార్ కార్డు స్టేటస్ ద్వారా డెలివరీ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

Tags:    

Similar News