సమయం లేదు మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే సమయం

పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధం రేపటి

Update: 2024-03-14 09:31 GMT

Paytm

పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధం రేపటి నుండి అంటే మార్చి 15 తర్వాత అమలులోకి వస్తుంది. ఈ రోజున ఇలాంటి అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ రోజువారీ జీవితాన్ని మార్చేస్తుంది. aytm గురించి మాట్లాడుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి చివరిలో Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై అనేక పరిమితులను విధించింది. దీనిలో కొత్త డిపాజిట్లు తీసుకోవడంపై తక్షణ నిషేధం ఉంది. అనేక ఇతర సర్వీసులు ఫిబ్రవరి 29 నుండి మూసివేయబడ్డాయి. తరువాత దాని చివరి తేదీ మార్చి 15 వరకు పొడిగించబడింది.

ఇప్పుడు మార్చి 15 తర్వాత, Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి ఇచ్చిన రాయితీని పొడిగించే అవకాశం చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో ప్రజలు Paytm పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అందులో మిగిలిపోయిన డబ్బును మాత్రం అయిపోయే వరకు ఉపయోగించుకోవచ్చు.

పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు:

ఇంతలో Paytm పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ కార్డ్‌లను కలిగి ఉన్న వారు వెంటనే వాటిని మార్చుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టం చేసింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్ టోల్ పాయింట్ల వద్ద పనిచేయదు. ఈ కార్డులకు బదులుగా మరేదైనా ఇతర బ్యాంకుల ఫాస్టాగ్ కార్డులను ఉపయోగించాలని NHAI ప్రజలకు సూచించింది.

Tags:    

Similar News