పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగింది ?
బిల్డర్ తో కలిసి ఉష తనను మోసం చేశారని జెమ్మా ఆరోపించింది. జెమ్మా ఇచ్చిన ఫిర్యాదును కోజికోడ్ పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్ కు
భారత అథ్లెట్, స్వర్ణ పతక విజేత, పరుగుల రాణి పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఫ్లాట్ విషయంలో తేడా రావడంతో కేరళ కోజికోడ్ పోలీసులు పరుగుల రాణి పీటీ ఉషతో పాటు మరో ఆరుగురిపై సెక్షన్ ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జెమ్మా జోసెఫ్ కోజికోడ్ లో 1012 చదరపు అడుగుల ఫ్లాట్ ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ మొత్తం రూ.46 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించింది. డబ్బుంతా చెల్లించినా ఆ బిల్డర్ ఫ్లాట్ ను జోసెఫ్ కు అప్పగించలేదు. దాంతో ఈ వ్యవహారానికి మధ్యవర్తిత్వం వహించిన పీటీ ఉషపై జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు చేసింది.
ఫ్లాట్ అప్పగించకపోవడంతో..
ఫ్లాట్ కోసం రూ.46లక్షలు పూర్తిగా చెల్లించినా.. ఫ్లాట్ ను తనకు అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బిల్డర్ తో కలిసి ఉష తనను మోసం చేశారని జెమ్మా ఆరోపించింది. జెమ్మా ఇచ్చిన ఫిర్యాదును కోజికోడ్ పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్ కు వివరణాత్మక విచారణకు పంపించారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిర్యాదుదారు కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా వెళ్లారు. అయినప్పటికీ, డబ్బులు తిరిగి చెల్లించేందుకు బిల్డర్ గానీ, పిటి ఊష గాని అంగీకరించలేదని ఫిర్యాదులో పేర్కొంది. జెమ్మా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే విచారణ ప్రారంభించి.. నిర్మాణదారులపై నిఘా ఉంచే కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.