నిజ నిర్ధారణ: వైరల్ వీడియోలో బాలీవుడ్ పాట పాడుతున్న వ్యక్తి ఆఫ్రికన్ గాయకుడు కాదు, భారతీయుడే
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కెన్యాకు చెందిన ఆఫ్రికన్ గాయకుడని, అయినా కూడా చాలా చక్కగా హిందీ పాటను బాగా పాడుతున్నాడనే వాదనతో ఒక వీడియో ప్రచారంలో ఉంది.
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కెన్యాకు చెందిన ఆఫ్రికన్ గాయకుడని, అయినా కూడా చాలా చక్కగా హిందీ పాటను బాగా పాడుతున్నాడనే వాదనతో ఒక వీడియో ప్రచారంలో ఉంది.
ఈ వాదన లేదా క్లెయిం ఫేస్‌బుక్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది, ఆంగ్లం లో ఉన్న క్లెయిం "" తర్జుమా చేయగా "కెన్యా నుంచి వచ్చిన ఈ ఆఫ్రికన్ సింగర్ నల్లజాతి వ్యక్తి. కళ్ళు మూసుకుని అతని గొంతు వినండి. అద్భుతమైన గాత్రం"
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియోలోని గాయకుడు కెన్యాకు చెందినవాడన్న వాదన అవాస్తవం. అతను సంజయ్ సావంత్ అనే భారతీయ హిందీ గాయకుడు.
జాగ్రత్తగా గమనించగా, వీడియోలో జాగృతి వీడియో ఫిల్మ్, భుజ్ అనే వాటర్ మార్క్ తో పాటు దాని చిరునామాను కూడా చూడవచ్చు.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లతో జాగృతి వీడియో ఫిల్మ్‌స్ భుజ్ అనే కీలకపదాలను జోడించి గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను ఉపయోగించి శోధించగా, ఫలితాలలో జనవరి 2021లో జాగృతి ఫిల్మ్‌స్ వారు తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసిన వీడియో "నా కిసీ కి ఆంఖ్ కా నూర్ హూన్ - రఫీ - లాల్ క్విలా 1960 - పాత హిందీ పాటలు - పాత పాటలు హిందీ హిట్స్" అనే టైటిల్ తో లభించింది. ఈ వీడియోలో గాయకుడు వైరల్ వీడియోలోని పాటనే పాడుతుండడం గమనించవచ్చు.
వ్యాఖ్యల విభాగంలో, గాయకుడు ఎవరు అంటూ వినియోగదారుడి ప్రశ్న కు గాయకుడు సంజయ్ సావంత్ అని సమాధానం ఇచ్చారు చానెల్ వారు.
అదే వీడియోను అభిషేక్ కుమార్ అనే మరో యూట్యూబ్ ఛానెల్ అదే వీడియో ను షేర్ చేసి "తెలియని గాయకుడు లెజెండ్ మొహమ్మద్ రఫీ పాడిన నా కిసీ కి ఆంఖ్ కా నూర్ హూన్ పాడాడు. దయచేసి ఎవరైనా ఈ అబ్బాయి పేరును కనుగొనగలరు. ధన్యవాదాలు." వివరణ ఇలా ఇచ్చారు. ఈ వీడియోపై వచ్చిన వ్యాఖ్యలు కూడా ఆ గాయకుడు సంజయ్ సావంత్ అని స్పష్టం చేసాయి.
సంజయ్ సావంత్ సోషల్ మీడియా పేజీలను కూడా కనుగొన్నాము. అతని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో "20 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సింగర్. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త షోల గురించి తెలుసుకోవడానికి అనుసరించండి." అని ఉంది.
https://www.instagram.com/sanjaysawantmusiic/
అతని ఫేస్బుక్ పేజీలో మరింత సమాచారం ఉంది.
https://www.facebook.com/singersanjaysawant
అందువల్ల, వైరల్ వీడియో చూసిన గాయకుడు కెన్యాకు చెందిన ఆఫ్రికన్ గాయకుడనే అబద్దపు వాదనతో షేర్ అవుతోంది. గాయకుడు భారతీయ ప్రసిద్ధ గాయకుడు సంజయ్ సావంత్.