ఫ్యాక్ట్ చెక్: తమ్ముడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 3 రోజుల పాటూ దీక్ష చేపడతానని హీరో సూర్య ప్రకటించలేదు.

తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు మూడు రోజుల పాటూ దీక్ష;

Update: 2024-09-26 05:23 GMT
Suriya, Karthi, HeroSuriya, ActorSuriya, PawanKalyan, TirupatiLaddoo, LaddooRow, Surya did not announce that he will take initiation for 3 days as an atonement for his younger brothers mistake, did karthi commented on tirumala laddu

TirupatiLaddoo

  • whatsapp icon
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల పెడుతున్న ప్రెస్ మీట్లలో సనాతన ధర్మాన్ని కించపరిచే వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని దర్శించుకుని ఆలయ మెట్లను కూడా కడిగారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కల్తీపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆవు నెయ్యి కంటే జంతువుల కొవ్వు ఎక్కువ ధర అన్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. సనాతన ధర్మంతో ఆడుకోవద్దని వైఎస్సార్‌సీపీ నేతలను హెచ్చరించారు. వైసీపీ హయాంలో వందలాది దేవాలయాలు కూల్చివేశారని ఆయన అన్నారు. ఇలాంటి దురాగతాలను ప్రతిఘటించేందుకు హిందువుల మధ్య ఐక్యత అవసరమని అన్నారు.

ఇక హైదరాబాద్ లో కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ జరిగింది. ఆ సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. కార్తీ ఫేమస్ డైలాగ్ గురించి స్పందించమని యాంకర్ కోరగా, లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం, దాని గురించి మనం మాట్లాడకూడదని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారం చాలా పెద్దది దయచేసి దీని గురించి ఫన్నీ కామెంట్స్ చేయకండని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మానికి మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ కోరారు. అపచారం జరిగిందని తాము బాధపడుతూ ఉన్నామని, కొందరు మాత్రం ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిణామాల అనంతరం నటుడు కార్తీ క్షమాపణలు చెబుతూ ట్వీట్ వేశారు. ”ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు చాలా గౌర‌వం, అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను” అని ట్వీట్ చేశాడు కార్తీ.

ఇంతలో హీరో సూర్య తన తమ్ముడి వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్ అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు. తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని, తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినీ హీరో సూర్య ప్రకటించినట్లుగా ట్వీట్ సోషల్ మీడియాలోనూ, ట్విట్టర్ లోనూ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ కు సూర్య ట్యాగ్ చేస్తూ.. 'తాను తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని,తాను రేపటి నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేస్తున్నానని, పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పారు.తమ్ముడు అలా అని ఉండాల్సింది కాదు' అని ఆ ట్వీట్ లో ఉంది.






 




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సూర్య దీక్ష చేపడతానని ఎక్కడా ప్రకటించలేదు.

హీరో సూర్య అధికారిక ట్విట్టర్ ఖాతా @Suriya_offl అందులో సూర్య మూడు రోజుల పాటూ దీక్ష చేస్తానని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పవన్ కళ్యాణ్ ట్వీట్ కు కేవలం థాంక్స్ మాత్రమే చెప్పారు. సూర్య ఒరిజినల్ అకౌంట్ లో 9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేక్ అకౌంట్లలో ఫాలోవర్లు చాలా తక్కువగా ఉన్నారు, కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించి ఈ ట్వీట్లను చేశారు.


సూర్య అఫీషియల్ అకౌంట్ @Suriya_offl పేరుతో ఉంటుంది. వైరల్ అవుతున్న ఫేక్ ట్వీట్ లో చివరి అక్షరం ఎల్ కి బదులు టి ఉండటంతో ఫేక్ అకౌంట్ అని అర్థం చేసుకోవచ్చు. మొదట ఫేక్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ ను చూసి సూర్య ఫ్యాన్స్, నెటిజన్స్ కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఫేక్ అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ కూడా చేసింది. సూర్య అకౌంట్ పేరుతో పేరడీ అకౌంట్ ను సృష్టించి కూడా ట్వీట్లు చేశారు.


ఒరిజినల్, ఫేక్ ట్వీట్ల మధ్య ఉన్న తేడాను మీరు గమనించవచ్చు.



 


పవన్ కళ్యాణ్ ట్వీట్ కు సూర్య స్పందన అంటూ సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేశాం. అందుకు సంబంధించి కొన్ని మీడియా కథనాలను కూడా చూశాం.

కార్తీ క్షమాపణలు చెప్పడంతో దానికి పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కార్తీ సినిమా “సత్యం సుందరం” రిలీజ్ కి హీరో కార్తీకి, నిర్మాత, కార్తీ సోదరుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి కూడా పవన్ కళ్యాణ్ తన బెస్ట్ విషెస్ తెలిపారు. కార్తీ రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత సూర్య కూడా పవన్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి థాంక్స్ చెప్పాడని పలు మీడియా కథనాలు కూడా చూశాం.

ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినీ హీరో సూర్య ప్రకటించలేదు. వైరల్ అవుతున్న ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫేక్ అకౌంట్ నుండి వచ్చింది.


Claim :  తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు మూడు రోజుల పాటూ దీక్ష చేస్తానని తమిళ నటుడు సూర్య తెలిపారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News