ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ లో చిన్మోయ్ దాస్ తరపున వాదనలు వినిపించిన లాయర్ ను చంపేయలేదు

గొడవల్లో చిన్మోయ్ దాస్ లాయర్ ను చంపేయలేదు;

Update: 2024-11-30 17:47 GMT
ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ లో చిన్మోయ్ దాస్ తరపున వాదనలు వినిపించిన లాయర్ ను చంపేయలేదు
  • whatsapp icon

బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేసి, దేశద్రోహ నేరం అభియోగాలు మోపిన తర్వాత ఆయన సహాయకుడితో సహా మరో ఇద్దరు సన్యాసులను బంగ్లాదేశ్ లో అరెస్టు చేసినట్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ఆరోపించింది.


బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పలు ర్యాలీలు నిర్వహిస్తున్న కృష్ణ దాస్‌ను నవంబర్ 25న "దేశద్రోహం" ఆరోపణపై అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ నిరాకరించడమే కాకుండా దేశద్రోహం కేసులో చిట్టగాంగ్ కోర్టు జైలుకు తరలించారు.

మరో ఇద్దరు సన్యాసులను బంగ్లాదేశ్ పోలీసులు నవంబర్ 29న అరెస్టు చేసినట్లు మాకు సమాచారం అందింది. చిన్మోయ్ కృష్ణ దాస్‌కు మందులు ఇచ్చేందుకు జైలుకు వెళ్లిన వారిని తిరిగి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి అరెస్టులను మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, మైనారిటీలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని కోల్‌కతాలోని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్, ప్రతినిధి రాధారమన్ దాస్ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల పట్ల భారతదేశం తన ఆందోళనను వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీలు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఆగస్టులో ప్రధానమంత్రిగా షేక్ హసీనా తప్పుకున్నప్పటి నుండి ఉద్రిక్తతలు పెరిగాయి. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై నిరసనలు చేపట్టిన కృష్ణ దాస్ ను అరెస్టు చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.

చిన్మోయ్ దాస్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ను చంపేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.




"బంగ్లాదేశ్ కోర్టు వెలుపల కొనసాగుతున్న నిరసనల మధ్య ప్రముఖ హిందూ నాయకుడు మరియు ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ వాదిస్తున్న ముస్లిం న్యాయవాది చంపబడ్డారు." అంటూ మరొకరు పోస్టు పెట్టారు.







వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు 



 





ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బంగ్లాదేశ్ లో ఇటీవలి అల్లర్లలో చనిపోయిన లాయర్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న లాయర్ కాదు.

మేము సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేయగా మృతుడు కృష్ణ దాస్ లాయర్ కాదని, బంగ్లాదేశ్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదని తెలుసుకున్నాం. బంగ్లాదేశ్ మీడియా సంస్థల నివేదికల ప్రకారం, కృష్ణ దాస్ మద్దతుదారులు, న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఇస్లాం మరణించారు.

ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లిం న్యాయవాది సైఫుల్లా ఇస్లాం హింసాత్మక ఘటనలో మరణించారని స్థానిక పోలీసులు ధృవీకరించారు.

భారత్ కు చెందిన మీడియా సంస్థలు కృష్ణ దాస్ లాయర్ ను చంపేశారంటూ కథనాలను ప్రచురించాయి. అయితే ఆ తరువాత ఆ తప్పును సరిదిద్దుకున్నాయి. రిపబ్లిక్ TV, OpIndia రెండూ ఒకే విధమైన క్లెయిమ్‌లను ప్రచురించాయి కానీ తర్వాత వారి కథనాలను నవీకరించాయి. రాయిటర్స్ కూడా ముస్లిం న్యాయవాది కృష్ణ దాస్‌కు వాదిస్తున్నారని నివేదించింది, అయితే తరువాత ఈ సమాచారాన్ని సవరించింది.

ఈ ఘర్షణలో మరణించిన న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూ బంగ్లాదేశ్ వార్తా వెబ్‌సైట్ 'సోమోయ్ న్యూస్' నివేదికను మేము కనుగొన్నాము. చనిపోయిన లాయర్ ఇస్లాం కృష్ణ దాస్ న్యాయవాది అని వచ్చిన నివేదికలను చైగావ్ మెట్రోపాలిటన్ పోలీసులు ఖండించారు.

ఢాకా ట్రిబ్యూన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వ సంస్థ CA ప్రెస్ వింగ్ కూడా ఈ వార్తలను ఖండించింది. మేము CA ప్రెస్ వింగ్ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను కనుగొన్నాం. అందులో కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న లాయర్ కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.

Full View


చత్తాగ్రామ్‌లో దారుణ హత్యకు గురైన న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్నారని కొన్ని భారతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చిన్మోయ్ కృష్ణ దాస్ సమర్పించిన వకలత్నామాలో న్యాయవాది సుబాసిష్ శర్మ తన లాయర్ అని తేలింది. రెచ్చగొట్టే, తప్పుడు రిపోర్టులకు దూరంగా ఉండాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నామని ఆ పోస్టులో ఉంది.

Full View


కృష్ణ దాస్ సమర్పించిన వకలత్నామాలో న్యాయవాది సుబాసిష్ శర్మ అని తేలింది. కాబట్టి, చనిపోయిన వ్యక్తికి కృష్ణ దాస్ లాయర్ కు ఎలాంటి సంబంధం లేదు.

అలీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిందని బిజినెస్ స్టాండర్డ్, ఢాకా ట్రిబ్యూన్‌ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఆ లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కృష్ణ దాస్ లాయర్ ను చంపేశారనే వదంతులను ఖండిస్తూ కథనాలను ప్రసారం చేశారు. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


కాబట్టి, బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సాధువు చిన్మోయ్ దాస్ తరపున వాదనలు వినిపించిన లాయర్ ను చంపేశారంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సాధువు చిన్మోయ్ దాస్ తరపున వాదనలు వినిపించిన లాయర్ ను చంపేశారు
Claimed By :  Social Media Users, Media Channels
Fact Check :  False
Tags:    

Similar News