ఫ్యాక్ట్ చెక్: డీఎంకే ప్రభుత్వం తమిళనాడులోని హిందూ దేవాలయాలను టార్గెట్ చేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు..?
చెన్నైలోని తాంబరంలో ఉన్న రాముడి గుడిని కూల్చివేస్తున్నారని పేర్కొంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వం తమిళనాడులోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు.
చెన్నైలోని తాంబరంలో ఉన్న రాముడి గుడిని కూల్చివేస్తున్నారని పేర్కొంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వం తమిళనాడులోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
మేము వీడియోలోని స్క్రీన్‌షాట్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించామ. జనవరి 11, 2022న 'Polimer News' YouTube ఛానెల్ ప్రచురించిన ఇలాంటి విజువల్స్‌తో కూడిన వీడియోను మేము కనుగొన్నాము.
పోలిమర్ న్యూస్ ప్రకారం, నదీ గర్భాన్ని ఆక్రమించుకుని నిర్మించిన ఆంజనేయర్ ఆలయాన్ని కూల్చివేసినట్లు చిత్రాలు చూపిస్తున్నాయి. ఈ న్యూస్ అవుట్‌లెట్ ప్రకారం, ఆక్రమణలకు పాల్పడ్డ ఒక చర్చి గోడను కూడా కూల్చివేశారు.
సంబంధిత కీలకపదాలను ఉపయోగించి, జనవరి 11, 2022న 'DT నెక్స్ట్' ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము.
కథనం ప్రకారం, జనవరి 10, 2022 న, తమిళనాడులోని చెన్నైలోని తాంబరం ప్రాంతానికి సమీపంలోని వరదరాజపురంలో అడయార్ నదీగర్భాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు, తాంబరం అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని పోలీసు బలగాలు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేశారు. అనేక ఇతర వార్తా వెబ్‌సైట్‌లు కూడా జనవరి 2022లో తమ కథనాలలో ఇదే సమాచారాన్ని ప్రసారం చేశాయి.
https://www.hindutamil.in/
https://www.indiatoday.in/
https://temple.dinamalar.com/
In response to the controversy surrounding the destruction of the Anjaneyar temple, the Tambaram Police Commissioner issued a press release in January 2022 informing the public that all religious and commercial structures constructed illegally by encroaching the Adyar riverbed would be destroyed in accordance with the 2015 Madras High Court order. During the encroachment drive, Tambaram Commissioner said, a church and the Anjaneyar temple were demolished.
ఆంజనేయర్ ఆలయాన్ని ధ్వంసం చేసిన వివాదంపై స్పందిస్తూ, తాంబరం పోలీస్ కమీషనర్ 2022 జనవరిలో పత్రికా ప్రకటన విడుదల చేస్తూ అడయార్ నదీగర్భాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన అన్ని మతపరమైన, వాణిజ్య నిర్మాణాలను 2015 మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల నిబంధనల ప్రకారం ధ్వంసం చేశామని ప్రజలకు తెలిపారు. ఆక్రమణల కూల్చివేతల సందర్భంగా తాంబరం కమీషనర్ మాట్లాడుతూ, ఒక చర్చి, ఆంజనేయర్ ఆలయాన్ని కూల్చివేశామని తెలిపారు.
కాబట్టి.. ఈ పోస్ట్‌లో చేసిన దావా ప్రజలను తప్పుదారి పట్టించేది. తమిళనాడులోని అడయార్ నదీతీరాన్ని ఆక్రమించారని ఆలయాన్ని కూల్చివేశారు. అలాగే చర్చి గోడను కూడా కూల్చివేశారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : Image shows a saint meditating in Himalayas
Claimed By : Social Media Users
Fact Check : False