ఫ్యాక్ట్ చెక్: మళ్లీ పుట్టినాడు శోభన్ బాబు అంటూ వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు.. ఏఐ ద్వారా సృష్టించారు
తెలుగు సీనియర్ నటులు, దివంగత శోభన్ బాబును పోలిన వ్యక్తిని చూపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఒక వ్యక్తి బీచ్‌లో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మళ్లీ పుట్టినాడు శోభన్ బాబు.” అంటూ వీడియోను షేర్ చేశారు
తెలుగు సీనియర్ నటులు, దివంగత శోభన్ బాబును పోలిన వ్యక్తిని చూపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఒక వ్యక్తి బీచ్‌లో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“మళ్లీ పుట్టినాడు శోభన్ బాబు.” అంటూ వీడియోను షేర్ చేశారు
“మోడ్రన్ శోభన్ బాబు గారు” అంటూ కూడా పలువురు ఈ వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. వీడియోను మొబైల్ అప్లికేషన్‌ని ఉపయోగించి రూపొందించారు. AI ద్వారా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.ఎక్స్‌ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా సెర్చ్ చేశాం. 0.50 సెకన్ల నుండి 0.58 సెకన్ల నిడివి వద్ద అదే బ్యాక్‌గ్రౌండ్ లో ఓ వ్యక్తిని చూపించే స్కిల్స్‌మోటివ్ అనే YouTube ఛానెల్ లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ నటుడు శోభన్ బాబు కాదు.
ఇలాంటి షార్ట్‌ని అనేక ఇతర YouTube వినియోగదారులు కూడా షేర్ చేసారు, వాటిలో అన్నీ ఒకటే కానీ.. ముఖం మాత్రం వేరేది ఉండడాన్ని గమనించాం.
‘Created with Photo Lab app #photolab’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారని కూడా గుర్తించాము. డిసెంబర్ 26, 2023న వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ షార్ట్ వీడియోలో photolab.me అనే వాటర్ మార్క్ ను గమనించాం.
మేము photolab.me గురించి మరింత సెర్చ్ చేయగా.. ఇందులో ఫోటోలకు స్టైలిష్ ఎఫెక్ట్‌లు, చాలా ఫేస్ ఫిల్టర్‌లను, ఫోటోలను ఎడిట్ చేసే అవకాశం ఉన్న మొబైల్ యాప్ అని మేము కనుగొన్నాము. ఫోటో ల్యాబ్ మీ ఫోటోకు మరిన్ని మెరుగులు దిద్దడానికి, మీ సెల్ఫీకి రియాలిటీని జోడించాలనుకునే దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ ను అందిస్తుంది. AI ఫోటో ఎడిటర్ యాప్‌గా
వినియోగదారులు ఫోటో ఫ్రేమ్‌లు, రియలిస్టిక్ ఫోటో ఎఫెక్ట్‌లు, ఫేస్ ఫోటో మాంటేజ్‌లు మొదలైనవాటిని సృష్టించవచ్చు. తమను తాము కార్టూన్ పాత్రగా మార్చుకునేలా కూడా ముఖాలను మార్చుకోవచ్చు. అసాధారణమైన సెల్ఫీలను సృష్టించడానికి ఇందులో ప్రత్యేకమైన అల్గారిథమ్ కూడా ఉంది. ఇలా ఎన్నో ఈ యాప్స్ ద్వారా చేయవచ్చు.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి తెలుగు సీనియర్ నటుడు దివంగత శోభన్ బాబు లాంటి వ్యక్తి కాదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ చిత్రం ఏఐ ద్వారా.. మొబైల్ యాప్ సహాయంతో సృష్టించారు.
Claim : Viral video shows Telugu veteran actor late Shobhan Babu’s doppleganger
Claimed By : Social media users
Fact Check : False