ఫ్యాక్ట్ చెక్: మయన్మార్ దేశం నుండి భారత దేశానికి దొంగ మార్గం అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు

మణిపూర్‌ రాష్ట్రంలోని రెండు జాతులైన మెయిటీ, కుకీ మధ్య ఘర్షణలు ప్రారంభమవడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతం నుండి భయభ్రాంతులకు గురిచేసే అనేక షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడి అల్లర్లను అణచివేయడానికి ప్రభుత్వం, భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

Update: 2023-08-22 14:07 GMT

మణిపూర్‌ రాష్ట్రంలోని రెండు జాతులైన మెయిటీ, కుకీ మధ్య ఘర్షణలు ప్రారంభమవడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతం నుండి భయభ్రాంతులకు గురిచేసే అనేక షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడి అల్లర్లను అణచివేయడానికి ప్రభుత్వం, భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఒక సమూహం పర్వతాలను ఎక్కుతూ.. కష్టమైన దారిలో ఇతర ప్రదేశానికి వెళుతున్నట్లు చూపించే వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. పొరుగున ఉన్న మయన్మార్ నుండి భారతదేశంలోని మణిపూర్‌లోకి ప్రవేశించే వారికి సంబంధించిన వీడియో ఇది అంటూ ప్రచారం చేస్తున్నారు.

“*మయన్మార్ దేశం* నుండి *భారత దేశం మణిపూర్ * వరకు దొంగ మార్గం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ..చుట్టపు చూపులా వచ్చి హిందులు ఆస్తులు ఆక్రమించారు . ఇప్పుడు మోడీ ఉండడము వలన దొంగ దారిలో భారత్ చేరుకుంటున్న ముస్లింలు. మీ ప్రాణాలను ఎలా కాపాడుకొంటారో ఈ వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కడుపులో పిల్ల సంకలో ఒక్క పిల్ల తో దైర్యంగా భారతదేశానికి వస్తాన్నారు, మణిపూర్ లో హింస, గొడవలకు కారణం ఎవరో అర్ధం ఐ ఉంటుంది అనుకుంట ” అంటూ వీడియోను షేర్ చేశారు.
Full View

Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్

వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది ఇరాన్ లో కుర్దిస్తాన్ ప్రాంతంలోని నోమాడిక్ జాతికి చెందిన వాళ్లు.

మేము వీడియో నుండి సంగ్రహించిన కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం.. అనేక మంది ఇతర Facebook వినియోగదారులు అదే వీడియోని “ژیانی ڕۆژانەی پڕ لەسەختی دانیشتوانی گوندێک کە خەڵکەکەی هەموو کوردن ..!!” అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నట్లు మేము కనుగొన్నాము:

అనువదించినప్పుడు, "కుర్దిష్ గ్రామస్తుల రోజువారీ జీవితం" అని అర్థమని తెలిసింది.
Full View

Full View
దీన్ని మేము క్యూ గా తీసుకుని “Nomadic life of Kurdish people” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. మేము ఆ సమయంలో కుర్దిష్ ప్రజలకు సంబంధించిన వీడియోను చూశాం.

దేనా అనే యూట్యూబ్ ఛానెల్ లో మార్చి 12, 2023న షేర్ చేసిన “Risk for life. Iranian Nomadic family” పేరుతో ఉన్న సుదీర్ఘమైన వీడియోను కనుగొన్నాం. ఇరానియన్ సంచార కుటుంబానికి సంబంధించిన వివరాలను ఇందులో చెప్పుకొచ్చారు. ‘ముగ్గురు చిన్న పిల్లలతో కూడిన ఇరానియన్ సంచార కుటుంబం తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో కష్టమైన మార్గంలో ప్రయాణిస్తుందని తెలిపారు'.

ఈ వీడియోలోని వ్యక్తులు, విజువల్స్ రెండూ వైరల్ వీడియోలోని దానితో సరిపోలుతున్నాయి.

Full View

ఇరాన్‌లోని సంచార ప్రజల ఇబ్బందులను తెలియజేసే ఇలాంటి వీడియోలను యూట్యూబ్‌లో చూడవచ్చు.

Full View

వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా ఈ వీడియోలలో ఉన్నది మయన్మార్ నుండి భారతదేశంలోకి వచ్చే సీక్రెట్ మార్గం కాదు. ఇరాన్ లో సంచారజాతులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోడానికి చేస్తున్న ప్రయత్నం.
Claim :  Video shows stealth route from Myanmar to Manipur enabling people to enter India illegally
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News