Hyderabad : వీధికుక్కల దాడిలో గాయపడిన బాలుడి మృతి

జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించాడు;

Update: 2024-07-17 02:56 GMT
Hyderabad : వీధికుక్కల దాడిలో గాయపడిన బాలుడి మృతి
  • whatsapp icon

హైదరాబాద్ లో వీధికుక్కలు పసి కూనల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక మంది వీధి కుక్కల బారిన పడి మృత్యువాత పడినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎందరో అమాయకులు బలి అవుతున్నారు.

జవహర్ నగర్ లో...
తాజాగా జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించాడు. వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న విహాన్ పై వీధికుక్కలు విచక్షణా రహితగా దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మరణించాడు. దీంతో వీధికుక్కల దాడిలో మరొక అభాగ్యుడు బలయ్యాడు.


Tags:    

Similar News